నాయుడుపేట జువ్వలపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సులో 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.