ఈ ఏడాది భారత్‌ దూకుడే

0
1794

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో అద్భుతంగా 12.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో కూడా గత ఏడాది 2.3 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసిన చైనా కన్నా వృద్ధి రేటులో భారత్‌ ఎంతో శక్తివంతంగా ఉంటుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.

అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో వృద్ధి రేటు 6.9 శాతం ఉండవచ్చ ని అంచనా వేసింది. కరోనా ప్రభావం వల్ల 2020-21లో భార త ఆర్థిక వృద్ధి రేటు మైనస్‌ 8 శాతానికి దిగజారింది. ఈ అంచనా వర్థమాన దేశాలే కాకుండా సంపన్న దేశాల వృద్ధి అంచనా కన్నా ఎంతో శక్తివంతమైనది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఇంత బలమైన వృద్ధి అంచనా వెలువడడం భారత్‌కు శుభ సూచిక అని పరిశీలకులంటున్నారు.

కరోనాను ప్రపంచ మహమ్మారి గా ప్రకటించి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వర్థమాన దేశా ల తలసరి ఆదాయం 2019 తలసరి ఆదాయంలో 20 శాతానికే పరిమితం కావచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. ఇంత నిరాశావహమైన స్థితిలో కూడా భారత్‌ బలమైన వృద్ధిని సాధించడం ఆసియా ప్రాంతీయ బృందంపై అత్యంత సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here