ఇద్దరు వ్యక్తుల అరెస్ట్,400 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను పట్టివేత
బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు 3 లక్షలు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లోని రాపనపల్లి అంతర్రాష్ట్ర వంతెన వద్ద CRPF మరియు స్థానిక పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారును ఆపి దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అడిగి కారుని తనిఖీ చేయగా సంచుల మూటలు కనిపించడం జరిగింది వాటిని ఓపెన్ చేసి చూడగా విత్తనాలు పాక్ చేసిన ప్యాకెట్లు కనిపించగా వాటికి సంబంధించిన వివరాలు అడగగా అవి నకిలీ విత్తనాల పాకెట్స్ అని వాటిని మహారాష్ట్ర నుండి తక్కువ ధరకు తీసుకోవచ్చి కోటపల్లి చండూరు మండల ప్రాంతాలలో అన్ని గ్రామాల ప్రజలకు ఎక్కువ ధరలకు ఆపడానికి వస్తున్నామని తెలపడం జరిగింది.వెంటనే కారును, నకిలీ విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఏసీపీ జైపూర్ నరేందర్ తెలిపారు.
పట్టుబడిన నిందితుల వివరాలు
1.మనోజ్ శేషారావు s/o శేష రావు 30yrs, భార్సింగి నార్కెడ్ తాలూకా, నాగపూర్
2.నితిన్ ప్రకాష్ మoచంట్ s/o ప్రకాష్,30yrs, పెర్సొడి, శావుర్ తాలూకా, నాగపూర్.
స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు
1.షిఫ్ట్ కారు MH35P 1959
400 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల