ఈ వారం ప్రారంభం నుంచి నష్టాల్లోనే పయనిస్తున్న సూచీలు ఈ రోజూ (శుక్రవారం) అదే పరంపరను కొనసాగిస్తున్నాయి. అమెరికాలో బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, ఐరోపాలో మరోసారి కరోనా కేసులు పెరగడం వంటి కారణాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
48,881 ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 9.50 గంటల సమయానికి 348 పాయింట్లు కోల్పోయింది. ఇక, 14,448 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 9.50 గంటల సమాయానికి 112 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ స్వల్ప లాభాలను అర్జించగా.. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సన్ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.