భారత్‌తో సహా పలు దేశాల్లో అరగంట నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం అప్లికేషన్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఎలాంటి సందేశాలు, పోస్ట్ కావడం లేదు. కొత్త అప్డేట్‌లు కూడా రావడం లేదు. అయితే దీనిపై ఫేస్‌బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సర్వీసులు ఆగిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయోనని ఆయా దేశాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. మూడు అప్లికేషన్లకూ ఫేస్‌బుక్ మాతృసంస్థ కావడం, మూడు ఒకేసారి ఆగిపోవడం యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ మూడు సోషల్ మీడియా అప్లికేషన్లు ఒక్కసారిగా ఎందుకు నిలిచిపోయాయో తెలియాల్సి ఉంది.