కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌కి షాక్..?

0
1364

ఒక సినిమా విషయంలో నిర్మాతలు, దర్శకులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆసమయంలో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌కి సంబంధించిన విషయాలను కొన్ని సందర్భాలలో వారికే చెప్పకుండా నిర్మాతలు షాకింగ్ డెసిషన్స్ తీసేసుకుంటుంటారు. ఇది తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలోనే కాదు ప్రతీ చోట సహజంగా జరిగేదే. తాజాగా ఒక తమిళ సినిమా విషయంలో కూడా నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సీనియర్ స్టార్ హీరోయిన్‌కి షాకిచ్చినట్టైందని కోలీవుడ్ మీడియాలో చెప్పుకుంటున్నారట. ఇలా ఎందుకు జరిగింది అన్నది క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

త్రిష సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించి భారీ సక్సస్‌లు తన ఖాతాలో వేసుకుంది. అయితే కొత్త హీరోయిన్స్ రావడంతో త్రిషకి అవకాశాలు తగ్గాయి. తెలుగులో అయితే దాదాపు కనుమరుగైనట్టే. కానీ తమిళంలో 96 సినిమా తర్వాత అనూహ్యంగా త్రిష కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. విజయ్ సేతుపతితో కలిసి త్రిష నటించిన 96 మంచి హిట్ సాధించింది. దాంతో వరగా సినిమాలకి సైన్ చేసింది. ఇప్పుడు త్రిష చేతిలో అరడజను సినిమాలున్నాయని సమాచారం. వీటిలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొఇన్నియన్ సెల్వన్’ కూడా ఉంది.

కాగా తమిళంలో త్రిష తన కెరీర్‌లో నటించిన 60వ సినిమా ‘పరమపథం విలయాట్టు’. తిరుగ్ననం దర్శకత్వం వహించిన ఈ సినిమా 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయినప్పటికి కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. పరిస్థితులన్ని చక్కబడటంతో మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. దాంతో త్రిష చాలా హ్యాపీగా ఫీలయిందట. అంతేకాదు ఈ సినిమా సక్సస్ మీద కూడా చాలా నమ్మకాలు పెట్టుందట. కానీ మేకర్స్ ఇక్కడే త్రిషకి షాకిచ్చారని తెలుస్తోంది. థియోటర్స్‌లో రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పడంతో త్రిష అవాక్కయినట్టు చెప్పుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఆమె అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here