‘నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మే 20 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, అభిమానులెందరో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. కరోనా బారి నుంచి త్వరగా కోలుకుని.. ఆరోగ్యంగా బయటికి రావాలని కోరారు. అలాగే ఆయురారోగ్యాలతో.. నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని పెద్దలు ఆయనను ఆశీర్వదిస్తూ.. ట్వీట్స్ చేశారు. వారందరికీ.. కృతజ్ఞతలు తెలుపుతూ యంగ్ టైగర్ పై విధంగా ట్వీట్‌లో పేర్కొన్నారు.