దండేపల్లి లో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

0
1325

దండేపల్లి లో ఎనిమొదవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన కార్యక్రమం

ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి
మధ్యాహ్న భోజన వంట కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి

కార్మికుల సమస్యల ని పరిష్కరించాలి
గౌరవ వేతనం 1వేయి తో ఎలా బ్రతకాలో ప్రభుత్వమే చెప్పాలి ..
AITUC జిల్లా కార్యదర్శి మేకల దాసు

దండేపల్లి లో మధ్యాహ్న భోజన కార్మికులు 8 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు గా వ్యవహరించడాన్ని A.I.T.U.C జిల్లా కార్యదర్శి మేకల దాసు తమ నిరసన వ్యక్తం చేశారు ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న కార్మికులను సందర్శించిన మేకల దాసు మాట్లాడుతూ గౌరవవేతనం 1వేయి ఇవ్వటం ఏ చట్టపరిదో ప్రభుత్వం చెప్పాలి. వెయ్యి తో ఎలా బ్రతకాలో కూడా వివరించాలని . మధ్యాహ్న భోజనాల దగ్గర కార్మికుల గ పని చేసేకంటే రోజు రోజు వారి పని వాల్లే ఎక్కువ వేతనం తీసుకుంటున్నారు అన్నారు మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని పెండింగ్ మేస్ బిల్లులు ఇవ్వాలని వైద్య సౌకర్యం తో పాటు ప్రమాద బీమా ఐదు లక్షలు చెల్లించాలని , సామాజిక భద్రత ప్రయోజనాలను ప్రమాద బీమా పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు .
A.I.T.U.C. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు
ఈ కార్యక్రమంలో మేదరి దేవవరం
కేతిరెడ్డి రమణారెడ్డి మరియు కార్మికులు పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here