బెల్లంపల్లి పోలీసుల ఆద్వర్యంలో .. మూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. ఏసీపీ ఎడ్ల మహేష్

0
804

గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆద్వర్యం లో
మూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .
. నిర్వహించారు

ప్రతి గ్రామం లో ప్రత్యేక నిఘా ..
గంజాయి సాగు చేస్తే రైతు బంధు రద్దు కి ప్రణాళికలు సిద్ధం .. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
గంజాయి వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు .. ఏసీపీ ఎడ్ల మహేష్

తాండూర్ సర్కిల్ ఆఫీస్ (మాదారం పోలీస్ స్టేషన్) గ్రౌండ్ లో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల నిర్ములన పై తాండూర్, మాదారం, భీమిని, కన్నెపల్లి మండలం లోని మూడు వేల మంది రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఏమ్మెల్యే దుర్గం.చిన్నయ్య , ఏసీపీ ఏడ్ల మహేష్ హాజరు అయ్యారు. అనంతరం ఏసీపీ మహేష్ మాట్లాడుతూ…..
ప్రస్తుత కాలంలో మాధక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిశ్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్క పౌరుడు మారక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలనీ , గంజాయి మత్తు లో బంగారు భవిష్యత్తు ని తాకట్టు పెట్టొద్దు అని చెప్పారు , మత్తు పదార్థాల వాడకం వాళ్ళ ఎన్నో కుటుంబాలు రోడ్డు న పడ్డాయని గుర్తు చేశారు . మత్తు లో ఎం చేస్తారో కూడా తెలియని దుస్థితి పడుతుందని చెప్పారు , గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిపై కఠినపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో, పట్టణాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికితే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని, అలాగే పట్టా భూములలో గంజాయి దొరికితే ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్దు చేయడం జరుగుతుందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు .

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ….ప్రతి ఒక్క సర్పంచ్ గంజాయి నివారణకు సహకారం అందించాలని తెలిపారు. గంజాయి సాగు చేసిన వారిపై పిడి యాక్ట్ కేసులు, పది సంవత్సరాలు జైలు శిక్ష విదిస్తామన్నారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి గంజాయి సాగు నివారణ పై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నారని బంగారు తెలంగాణలో గంజాయి పూర్తిగా నిర్ములిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారి గ్రామం మొత్తం రైతు బంధు కట్ చేస్తాం అని తెలిపారు. ప్రతి ఒక్క సర్పంచ్ రైతులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించి గంజాయి నివారణకు భాగస్వాములు అవ్వాలన్నారు.
ఈ కార్య క్రమం లో బెల్లంపల్లి పట్టణ సి .ఐ ముస్క రాజు , రురల్ సి,ఐ జగదీష్ , తాండూర్ సి,ఐ బాబు రావు లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here