వనం వీడి జన జీవన స్రవంతి లోకి రండి .. మావోలకు డీజీపీ మహేందర్ రెడ్డి పిలిపు

0
1448

కరోనా అనే పదం వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి . ఆ మహమ్మారి భారీ న ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు .కొన్ని కోట్ల మంది ఆర్థికంగా చితికి పోయారు . తన మన బేధం లేదు ఆ మహమ్మారికి ఎక్కడికైనా వెళ్తుంది ఎవరినైనా నా బలి తీసుకుంటుంది అయితే ఇప్పుడు … అడవిలో ఉన్న ఎంతో మంది మావోయిస్టులకు సైతం ఇప్పుడు కోవిడ్ సవాల్ గా మారింది చాల మంది మావోయిస్టులు కరోనా బారిన పడి అనారోగ్యం తో భాధ పడుతూ సరైన వైద్యం లేక ఇబ్బంది పడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు.. ఒక వైపు అగ్ర నాయకులకు వృద్యాప్యం పెరిగి పోవడం . చాల మంది అనారోగ్యాల పాలు అవడం తో అడవి లో అన్న అస్త వ్యవస్థలు పడుతున్నారని తెలుస్తుంది . ఎన్నో ఎల్లా నుంచి జనం కోసం వనం లోకి వెళ్లి అజ్ఞాతం లో ఉంటున్న మావో లకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వనం వీడి జన జీవన స్రవంతి లో కి రండి పిలుపునిచ్చారు ..

కరోనా మహమ్మారి మావోయిస్టులను కూడా కబలిస్తుండడంతో, ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోతే చికిత్స చేయించి, వారికి పునరావాసం కల్పించి, అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం డిజిపి మహేందర్ రెడ్డి పర్యటించారు. మొదట హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న డిజిపికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు, రామగుండం సిపి సత్యనారాయణ, జిల్లా పోలీసు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన పోలీసుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఇత్తమ సేవలందించిన పోలీసులను అభినందించడంతో పాటు వారికి రివార్డులు అందజేశారు. మావోయిస్టు కార్యకలాపాలపై  పోలీసులు చేసిన పనితీరును డీజీపీ సమీక్ష సమావేశంలో పోలీసులను అభినందించి మావోయిస్టు కార్యకలాపాల కట్టడిలో పాల్గొన్న పోలీసులకు రివార్డులు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటు వంటి నాలుగు జిల్లాలో మొత్తం కలిపి 31 డిస్టిక్ట్ గార్డ్స్, మావోయిస్టులు పునరావృతం కాకుండా నిరంతరం కష్టపడుతున్నారని, కూబింగ్ ఆపరేషన్ చేస్తున్నారని, కమ్యూనిటీ పోలీస్ ద్వారా ప్రజలకు నిరంతరం దగ్గరవడానికి కృషి చేస్తున్నారన్నారు. మళ్ళీ మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం చేస్తే క్షణాల్లో పట్టుకోవడానికి జిల్లాలో ఉన్నటు వంటి పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, పోలీసులకు అందించిన సహాయ సాహకారాలు పోలీసులకు ఎప్పటికి గుర్తించుకుంటారని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్నటువంటి పోలీసులను అభినందిస్తున్నామన్నారు. రానున్న కాలంలో కూడా ఇలాగే పని చేయాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాంతి భద్రతల కు నిలయంగా మారాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా ఉండాలని అన్నారు.
కరోనా బారిన పడి మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడం జరిగిందని, వారు స్వచ్చందంగా లొంగిపోతే, వారికి చికిత్స చేయించడంతో పాటు, పునరావాసం కల్పించి, వారికి ఎలాంటి హాని జరగకుండా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. జిల్లాలో గతంలో వచ్చిన వెళ్ళిన మైలారపు ఆడేళ్ళు అలియాస్ భాస్కర్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉంచామని, వారు మరలా జిల్లాలోకి వచ్చే అవకాశం తక్కువని తెలిపారు. ఒకవేళ వచ్చినా కట్టుదిట్టంగా ఎదురుకునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.
జిల్లాలో కొంతమంది వ్యాపారులు అత్యాశకు పోయి, నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ, రైతులను మోసాగించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here