అడవిని వీడండి.. జనజీవనం లోకి రండి వైద్యం అందిస్తాం ..రామగుండం సీపీ సత్యనారాయణ I.P.S

0
1621

అజ్ఞాత వనం ని వీడండి జనజీవనం లోకి రండి.

మానవీయ కోణం లో వైద్యం అందిస్తాం : రామగుండం సీపీ సత్యనారాయణ

రామగుండం కమిషనరేట్ పరిదిలోని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలిస్ స్టేషను పరిథిలో సిపిఐ మావోయిస్టు పార్టీలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న పెద్దపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగొపాల్ రావు ఇంటికి వెళ్లి తల్లి మధురమ్మ తో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అజ్ఞాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా కుటుంబీకులు కోరాలని కుటుంబీకులకు సూచించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అడవిని వీడండి.. జనజీవనం లోకి రండి వైద్యం అందిస్తాం.. అని కరోనా బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి లొంగిపోతే వైద్యం అందిస్తామని రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. అడవిలో ఉంటూ చేసేదేమీ లేదని.. అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దన్నారు.ఆయుధాలు వీడి జన జీవం స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, పోలీసులు ఉన్నారని ఏలాంటి ఇబ్బందులు ఉన్నా చట్టపరిధిలో పోలీసులు పరిష్కరం చేస్తారన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజా స్వామ్యంలో అందరితో కలిసి, కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని కోరారు.

సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here