మంచిర్యాల జిల్లా లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుంది.
కరోనా కట్టడికి అనేక కార్యక్రమాలు చేపడుతు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది …..దానిలో భాగంగా కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా ప్రభుత్వము భావిస్తున్నప్పటికి ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటికి నిత్యావసరాల కొరత లేకుండా వినియోగదారులకు సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న 800 మంది కూరగాయల వ్యాపారులకు ,చికెన్ మరియు మటన్ వ్యాపారులకు, వీధి వ్యాపారులకు మరియు వినియోగదారులకు సానిటైజర్ బాటిల్స్ ను మంచిర్యాల మున్సిపల్ ఛైర్మెన్ పెంట రాజయ్య మరియు మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి చేతుల మీదుగా ఉచితముగా అందచేసి వారికి అవగాహన కల్పించడము జరిగినది.
ఈ కార్యక్రమము లో అసోసియేషన్. గౌరవ అధ్యక్షులు శ్రీ గొనె శ్యామ్ సుందర్ ,
అధ్యక్షులు గుండ సుధాకర్ ,కార్యదర్శి ఇరుకుళ్ల శ్రీనివాస్
సభ్యులు జుగల్ కిషోర్ వ్యాస్ ,చెట్ల జనార్దన్ , ఆనంతుల దినేష్ , రావుల మహేష్ మరియు సేవాభారతి సభ్యులు పాల్గొన్నారు.