లాక్డౌన్ ఉల్లఘనలకు పాల్పడితే చర్యలు తప్పవు-రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ I.P.S

0
1032

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. కరోనా వ్యాధిని నియంత్రించడంలో భాగం రాష్ట్ర
ప్రభుత్వం నేటి నుండి ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా లా డౌన్ కోనసాగుతున్న తీరును రామగుండం పోలీస్ కమిషనర్

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తా లో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను పోలీస్ కమిషనర్ మందలించడంతో పాటు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులకు పలుసూచనలు చేస్తూ రోడ్లపై వాహనాలను నియంత్రించేందుకుగాను బారీకేడ్ల ఏర్పాటు చేయడం పాటు, లాక్ డౌన్ సమయాల్లో రోడ్ల మీదకు వాహనదారులను ప్రశ్నించడంతో పాటు, వారి గుర్తింపు కార్డులను పరిశీలించాల్సి వుంటుందని. ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి మినహాయింపు వున్నవారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వారివద్ద ఇందుకు అవసరమైన షతాలను పోలీస్ అధికారులు పరిశీలించాలని పోలీస్ కమిషనర్ అదేశించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డి.సి.పి ఉదయ్ కుమార్ రెడ్డి తో పాటు స్థానిక ఇన్ స్పెక్టర్లు ముత్తి లింగయ్య, శ్రీనివాస్ ఎస్ఐ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here