లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెండా వెంకటాపూర్,గుల్లకోట, వెంకటరావుపేట్, లక్షేట్టిపేట్ దౌడేపల్లి శనివారం రోజు కోవిడ్ నియమ నిబంధనలు పాటించకుండా అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుంపులు గుంపులు గా ఉండి వివాహ వేడుక జరుపుకుంటున్నారనే సమాచారం మేరకు వెంటనే అక్కడికి లక్షేట్టిపేట ఎస్సై చంద్ర శేఖర్ సిబ్బందితో యుక్తంగా అక్కడికి చేరుకొని పెళ్లి పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహించి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇంటికి పంపించడం జరిగింది. మరియు ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితిలో కూడా లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన పెళ్లి పెద్దలు బుద్ది లచ్చక్క జెండా వెంకటాపూర్, గారే మల్లయ్య, గల్లా సాంబయ్య గుల్లకోట,కందరపు చంద్రయ్య వెంకట్రావు పేట్, మాటేటి రమేష్, పోలోజు శంకరయ్య లక్షెట్టిపేట్, సిలివెరీ శంకరయ్య, దౌడపల్లి అను వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సంధర్బంగా ఎస్ఐ చంద్ర శేఖర్ మాట్లాడుతూ….
పెళ్లి చేసే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అనుమతులు తీసుకోన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.కరోనా నియమ నిబంధనలు అందరూ పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ఆరోగ్యానికి హాని తలపెట్టవద్దని సూచించారు. ఇక నుండి జరిగే పెళ్లిళ్లలో కోవిడ్, లాక్ డౌన్ నియమ నిబంధనలను పాటిస్తూ పెళ్లిళ్లు జరుపుకోవాలని లేనిపక్షంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.