ఆకతాయిల ను ఐసొలేషన్ పంపించిన చెన్నూరు పోలీసులు
07 ద్విచక్రవాహనాలు సీజ్
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి పని పట్టడం జైపూర్ ఏసిపి నరేందర్ గారి ఆధ్వర్యంలో చెన్నూరు పోలీసువారి మొదలు పెట్టారు.
రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి రావద్దంటూ చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు.దీంతో కరోనా సోకుతుందని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్న వారికి సరైన బుద్ది చెప్పాలని నిర్ణహించి చెన్నూర్ పోలీస్ వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా ఆకతాయి గా బయట జరుగుతున్నటువంటి 14 మంది ఆకతాయిలను బెల్లంపెల్లి ఐసోలేషన్ కి పంపడం జరిగింది 7 బైక్స్ సీజ్ చేయడం జరిగింది అని ఏసీపీ గారు తెలిపారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో ఏసీపీ జైపూర్ నరేందర్ చెన్నూర్ సీఐ ప్రవీణ్ కుమార్ SI వినోద్,విక్టర్,సిబ్బంది పాల్గొన్నారు