ఏపీలో రేపటి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌

0
1739

ఏపీలో రేపటి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది.

దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు.

ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం..

ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది.

అంటే గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు.

రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here