తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బక్రీద్ పండుగ బందోబస్తు.. గోవధ కు సంబంధించి అన్ని జిల్లాల కమిషనర్స్, ఎస్పీలు మరియు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..
అనంతరం.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడుతూ..
జిల్లా లో బక్రీద్ పండుగకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఆవులు మరియు దూడల అమ్మకాలు జరగడానికి వీలులేదు అని అన్నారు..
జిల్లాలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. *ఎక్కడైనా అక్రమ అమ్మకాలు,రవాణా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే వెంటనే దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా 100 కు డయల్ చేయాలని కోరారు
ముఖ్యంగా జిల్లాలో గోవధ లాంటి అరాచకాలకు పాల్పడకూడదని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. పశువులను ఎక్కువ మొత్తంలో కూడా రవాణా చేయకూడదని,_
వాహనాలను ఎవరు పడితేవారు కూడా ఆపడానికి వీలు లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి తప్ప.. చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాహనాలు ఆపరాదని ఆయన అన్నారు.
ఈ సమీక్షలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్, మహబూబాబాద్ ఏఎస్పీ యోగేష్ గౌతమ్, తొర్రుర్ డిఎస్పీ వెంకటరమణ,ఎస్.బి సీఐ సురేందర్ లు పాల్గొన్నారు