టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో పేకాట స్థావరం పై మెరుపు దాడి

0
1342

06 మంది జూదరుల అరెస్ట్, పరారీలో 03

54,900/- రూపాయల నగదు, 06 సెల్ ఫోన్లు,ఒక ఆటో స్వాధీనం

రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో ఎస్ఐ లు షేక్ మస్తాన్, CH.నర్సింహా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ioc శివారులో ప్రాంతంలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని *పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 06 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. పరారీలో ముగ్గురు వ్యక్తులు, పట్టుబడిన వారి వద్ద నుండి 06 సెల్ ఫోన్లు 54,900/-నగదు, పేక ముక్కలు,ఓక ఆటో స్వాధీనపరచుకోవడం జరిగింది.

పట్టుపడిన వారి వివరాలు

1.ఎండి షేర్ ఖాన్,s/o మున్వర్ ఖాన్ 34yrs అశోక్ నగర్ గోదావరిఖని

2.ఎండి జాకీర్ s/o జమీల్ 37yrs అంబేద్కర్ నగర్ గోదావరిఖని

3.జి సర్వోత్తమం s/o:లచ్చయ్య 45yrs హనుమాన్ నగర్ గోదావరిఖని

4.ఎండి యూసఫ్ s/o రాజ్ మహమ్మద్ 43yrs అశోక్ నగర్ గోదావరిఖని

5.ఎం పోచం s/o రామస్వామి 43yrs హనుమాన్ నగర్ గోదావరిఖని

6.ఎండి యాకుబ్ s/o అలీమ్,35yrs శ్రీరాంపూర్ మంచిర్యాల్

పరారీలో ఉన్న వ్యక్తులు

7.ఎస్.కె కాజా 30 శివాజీ నగర్ గోదావరిఖని

8.శంకర్ గుణ హనుమాన్ నగర్ గోదావరిఖని

9.చింటూ జిఎం కాలనీ గోదావరిఖని

పట్టుకున్న నిందితులను మరియు స్వాధీనపరుచుకున్న నగదు, 06 సెల్ ఫోన్లు, ఒక ఆటో, పేక ముక్కలను తదుపరి విచారణ కొరకు అంతర్గo పోలీస్ వారికిీ అప్పగించడం జరిగిందని సీఐ రాజ్ కుమార్ తెలియజేశారు.

ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లు షేక్ మస్తాన్, ch.నరసింహ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రశేఖర్ ప్రకాష్, సునీల్,మల్లేష్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here