పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత సి .పి సత్యనారాయణ ఐ.పి.ఎస్

0
855

హరితహారంలో ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటి పచ్చదనాన్ని విస్తరించాలి:
తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా

హరితహారంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్,ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, డీసీపీ లతో మొక్కలు నాటారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఏడో విడత హరితహారం లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో హోంగార్డ్స్ ఆఫీసర్ నుండి ఉన్నతాధికారుల వరకు వారి వారి పేర్ల తో 500 మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….వనం తోనే మనం , పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరుగుతుంది అని తెలిపారు.చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కలు హరితహారం లో భాగస్వాములు కావాలని ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నాటిన ప్రతి ఒక్క బ్రతికే విధంగా శ్రద్ధ చూపాలన్నారు.

ఈ సందర్భంగా కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్లె నుండి పట్నం దాకా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. హరితహారం కార్యక్రమం లో అన్ని ప్రభుత్వ విభాగాలు పాలుపంచుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం ప్రజా రక్షణ కోసమే కాకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హరితహారంలో భాగస్వాములు అవుతూ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని,కాలుష్యం నుండి రక్షించాలని హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.అదేవిధంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ఒక అద్భుతమైన ఆలోచన తో గ్రీన్ చాలెంజ్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరు మరో ముగ్గురుకి చొప్పున గ్రీన్ ఛాలంజ్ ద్వారా మొక్కలు నాటడం జరుగుతున్నది ఈ ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోని ప్రముఖులు గవర్నర్ గారి దగ్గర నుంచి మంత్రులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు సినీ ప్రముఖులు వ్యాపార దిగ్గజాలు మొదలైన అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి చేస్తున్న సంతోష్ కుమార్ గారిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగింది.అస్సాం లో జాదవ్ పాయంగ్ అనే వ్యక్తి ఒక్కడే 1979 నుండి ఇప్పటివరకు బ్రహ్మ పుత్ర నదీ పరివాహక ప్రాంతంలో 1360 చెట్లు నాటడం జరిగింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది అన్నారు. ఇటువంటి మహనీయ వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి నుంచి స్ఫూర్తి పొంది మన తెలంగాణ రాష్ట్రo, తెలంగాణ తల్లికి హరిత శోభ చేకూర్చాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్,గోదావరిఖని ఏసీపీ ఉమెందర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి నారాయణ, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు,రాజకుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నరేందర్,ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్,AO డి.నాగమణి,ఆర్ ఐ మధుకర్, శ్రీధర్ విష్ణు ప్రసాద్, ఆర్ఎస్ ఐ రాజేష్ ప్రవీణ్, ఏ ఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది, హోం గార్డ్స్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here