ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మరియు మాస్క్ వాడకంపై అవగాహన మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు
హెల్మెట్ వాడండి మీ ప్రాణాలని కాపడుకోండి
రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర సిగ్నల్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు…
ద్విచక్ర వాహనాలదారులు బయటకు వస్తే కచ్చితంగా హెల్మెట్ ధరించాలాని, అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుందని వాహన దారులకు అవగాహన కల్పించారు. ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతిఒక్కరు విధిగా మాస్క్ ధరించి కోవిడ్19 వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషిచేయాలని సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజు, ట్రాఫిక్ ఎస్.ఐ సురేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.