విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటుతో అదరగొడుతున్న ముంబై కెప్టెన్ పృథ్వీ షా.. గత ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన గులాబీ టెస్ట్‌లో 0, 4 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్చినట్టు పృథ్వీ షా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నన్ను పక్కనబెట్టడంతో ఎంతో ఆందోళనకు లోనయ్యా. నా బ్యాటింగ్‌లో లోపాల గురించి ఆలోచించా. గులాబీ టెస్ట్‌లో ప్రపంచంలోని మేటి బౌలర్లను ఎదుర్కొన్నానని నన్ను నేను అనునయించుకున్నా. అద్దంముందు నిలుచొని నేను మరీ అంత చెత్త ఆటగాడిని కాదని సర్దిచెప్పుకొన్నా. అయినా దుఃఖం ఆగలేదు. వెక్కివెక్కి ఏడ్చా’ అని చెప్పుకొచ్చాడు.