క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

0
1729

పీవీ సింధు, లక్ష్యసేన్‌ ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జోడీ కూడా క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో  సింధు 21-8, 21-8తో లిన్‌ క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేసింది. లక్ష్యసేన్‌  21-18, 21-16తో రౌక్సెల్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తుచేసి తొలిసారి ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్స్‌కి చేరాడు. మరో రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 15-21, 14-21తో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కెంటో మొమోటా చేతిలో ఓటమితో ఇంటిదారి పట్టాడు. సాయి ప్రణీత్‌ 21-15, 12-21, 21-21తో రెండోసీడ్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో రెండో రౌండ్‌లో  పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో సిక్కిరెడ్డి/అశ్వినీ పొన్నప్ప 21-17, 21-10తో స్టొయేవా/స్టెఫానిపై నెగ్గి క్వార్టర్స్‌ చేరింది. పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్‌లో సాత్విక్‌సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి, మిక్స్‌డ్‌లో జక్కంపూడి మేఘన/ఽధ్రువ్‌ కపిల జోడీ ఓడాయి. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/అశ్వినీ పొన్నప్ప  తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది. కాగా..బుధవారం రాత్రి జరిగి న మొదటి రౌండ్‌ పోటీల్లో ప్రణయ్‌, సాయిప్రణీత్‌, లక్ష్యసేన్‌, సమీర్‌వర్మ నెగ్గగా, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ సైనా నెహ్వాల్‌ గాయంతో అర్ధంతరంగా వైదొలగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here