కుటుంబ సభ్యులతో సహా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు క్రికెటర్లకు అనుమతినిచ్చింది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ప్రత్యేక విమానాల్లో బుధవారం ఇంగ్లండ్ పయనం కానున్నాయి. సుదీర్ఘ పర్యటన కావడంతో కుటుంబ సభ్యులకు కూడా బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అనంతరం యూకే ప్రభుత్వం అనుమతి కోరింది. తాజాగా యూకే ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మాత్రం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌నకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా నేరుగా మ్యాచ్ వేదిక వద్దకు రావడానికి ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ అనుమతినివ్వలేదు. దీంతో వీరు ఆ మ్యాచ్‌కు హాజరు కారని సమాచారం. కోహ్లీ సేన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. మహిళల జట్టు ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.