ఈ విద్యా సంవత్సరం నుండే 4 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రారంభం

0
2183

ఈ విద్యా సంవత్సరం నుండే 4 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రారంభం….
గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండే కి ఎంపీ సోయం బాపురావు కృతజ్ఞతలు….
2021 _22 విద్యా సంవత్సరం నుండి ఏజెన్సీలోని గిరిజన ఆదివాసి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను ప్రారంభించడం పట్ల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 23 ఈ ఎం ఆర్ ఐ గురుకులాలు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుండగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తన ప్రాతినిధ్యం మేరకు నాలుగు గిరిజన గురుకులాలు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతున్నాయి. గతంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండే ను కలిసి గిరిజన ఏకలవ్య గురుకులాలను మంజూరు చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 21.5 కోట్లతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని.. అదేవిధంగా ఉట్నూర్ నార్నూర్ మండల కేంద్రాల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ టి మండల కేంద్రంలో గిరిజన ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏజెన్సీలోని వెనుకబడిన గిరిజన విద్యార్థులకు స్వయం సాధికారిత.. ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన గురుకుల ను మంజూరు చేయడం పట్ల ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో విద్యార్థికి కేంద్ర ప్రభుత్వం రూ. 1,10,000 ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతి నుండి విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఈ మేరకు EMRI స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఎంపి సోయం బాపురావు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here