పోలీసులు అంటే శాంతి భద్రతలతో పాటు ప్రజా, సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తాము మంచిర్యాల …ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

0
1482

రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని ఊట్ల గిరిజన గ్రామాన్ని ఎసిపి సందర్శించారు దండేపల్లి మండలం ఊట్ల గిరిజన తండాకు వెళ్లే రహదారి మధ్యలో నుంచి చిన్న నీటి కాలువ ఉండటతో.. రాకపోకలకు ప్రజల ఇబ్బందిని గుర్తించి గిరిజనులు పడుతున్న ఇబ్బందులు గమనించిన పోలీసులు పైపు వేసి ఇబ్బందులు తొలగిస్తామని పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ ఇవ్వడం జరిగింది . దానిలో బాగంగా సోమవారం సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. దండేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో నీటి ప్రవాహం ఉన్న చోట పైపులు వేసి పైనుంచి మొరం పోసి కల్వర్టు నిర్మాణం జరిపించి, రోడ్డు బాగు చేసి, గిరిజనుల ఇబ్బందులు తొలగించారు. ఏసీపీ అఖిల్ మహాజన్, లక్షెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ పార చేతబట్టి మట్టి చదును చేశారు.అనంతరం చిన్నారులకు నోటు పుస్తకాలు అందజేశారు. పోలీస్ ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటామని,ఏదైనా సమస్యలు ఉంటె తమ అధికారుల దృష్టికి తీసుకువస్తే చట్టపరిధిలో పరిష్కరిస్తామని , చిన్నారులను బాగా చదివించాలని, యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని ఏసీపీ సూచించారు.

ఈ కార్యక్రమం లో లక్షెట్టిపేట్ సీఐ కరీముల్లా ఖాన్,ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here