బెల్లంపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం

0
1501

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని బెల్లంపల్లి పట్టణం లో ఆదివారం రోజు న స్థానిక అరుణ హాస్పిటల్ మరియు హెల్త్ కేర్ హాస్పిటల్(మంచిర్యాల ) ఆద్వర్యం లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డా ,, యశ్వంత్ , డా,, ఆంజనేయులు తెలిపారు . ఈ వైద్య శిబిరం లో పేద వారికి ఉచితంగా బీపీ , షుగర్ , గుండె కి సంబంధించిన ఈసీజీ ఉచితంగా టెస్ట్ లు చేస్తారని తెలిపారు . ఈ కార్యక్రమం లో వైద్య శిబిరం నిర్వాహకులు డా ,, యశ్వంత్ , డా,, ఆంజనేయులు మాట్లాడుతూ పేద వారికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంటుందని , ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి శాశన సభ్యులు దుర్గం చిన్నయ్య ,
బెల్లంపల్లి పట్టణ సి.ఐ ముస్క రాజు , రురల్ సి .ఐ జగదీష్ , ఎస్ ఐ సమ్మయ్య 19 వార్డ్ కౌన్సిలర్ కొమ్ము సురేష్ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ మెగా వైద్య శిబిరం లో సేవాలు అందించేందుకు , డా ,, యశ్వంత్ ,అరుణ హాస్పిటల్( బెల్లంపల్లి ) డా,, ఆంజనేయులు హెల్త్ కేర్ హాస్పిటల్(మంచిర్యాల ) , డా, భాగ్య లక్ష్మి, డా, రాజు ,డా, సాయి సృజ లు పాల్గొని సేవాలందిస్తారని , ప్రకటనలో తెలిపారు స్థలం : అరుణ హాస్పిటల్ గౌట్ కాలేజీ రోడ్ , బెల్లంపల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here