శాసనసభ్యులు దివాకర్‌రావు చారవతో 500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం…
ఆ ఆనందోత్సవాలలో తెరాస శ్రేణులు…
ప్రత్యేక పర్యవేక్షణలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు
మంచిర్యాల బ్యూరో, జనంసాక్షి : జిల్లా కేంద్రంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని శాసనసభ్యులు దివాకర్‌రావు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు సైతం ప్రారంభించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు వైద్య విద్యార్థినీ, విద్యార్థులకు కళాశాల అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా వైద్య వృత్తిని అభ్యసించే విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
అనందోత్సవాలలో తెరాన శ్రేణులు…
ఎన్నో సంవత్సరాల నుండి వైద్య కళాశాల గురించి కలలు కన్న మంచిర్యాల ప్రజలకు శాసనసభ్యులు దివాకర్‌రావు మంచి శుభవార్తను అందించారు. వైద్య కళాశాల కోసం కృషి చేసి పట్టు బట్టి మంచిర్యాలకు తీసుకు రావడంలో దివాకర్‌రావు సఫలం అయ్యారు. వైద్య కళాశాల నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన శాసనసభ్యులు దివాకర్‌రావుకు ప్రజాప్రతినిధులకు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.
ఈ ఏడాదే తరగతులు ప్రారంభం..
నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని శాసనసభ్యులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కళాశాలకు అవసరమైన భూమిని సమకూర్చినట్లు చెప్పారు. మార్కెట్ కమిటీకి సంబంధించిన పది ఎకరాల భూమితో పాటు మరో 22 ఎకరాలు భూదాన్ భూమి వెరసి 32 ఎకరాల భూమిని ఇప్పటికిప్పుడు వైద్య కళాశాల కోసం సమకూర్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి నిధులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని ఆయన స్పష్టం చేశారు. వైద్య కళాశాల మంజూరు అయిన నాటి నుండి నేటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో 15 సార్లు హైదరాబాద్ వెళ్లి రావడం జరిగిందని ఆయన తెలిపారు.
మంచిర్యాల జిల్లా ప్రజల అక్కంక్ష నెరవేరింది…
మంచిర్యాలకు వైద్య కళాశాల మంజూరు కావడంతో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరిందని శాసనసభ్యులు
నడిపెల్లి దివాకర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల మంజూరుతో మంచిర్యాలతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల వారికి
తం వైద్య సేవలు ఎంతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడిందని, కళాశాల మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి
సి.ఆర్., మంత్రులు కె.టి.ఆర్., హరీష్‌రావులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నడిపల్లి చారిటబుల్ టస్ట్
చైర్మన్ విజిత్‌రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అత్తి సరోజ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కొమరం
బాలు, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా! అరవింద్, నాయకులు తిరుపతి, గాదె సత్యం, మొగిలి శ్రీనివాస్, గొంగళ్ల శంకర్
తదితరులు పాల్గొన్నారు.