మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం

0
591

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం..
పటేల్ వ్యాపారవేత్తల సమావేశానికి విశేష స్పందన , హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త .. ఎయిమ్స్ హాస్పిటల్ అధినేత యెగ్గన శ్రీనివాస్ ,

ఏడు సదస్సులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని తెలంగాణలో మున్నూరు కాపుల మధ్య వర్తక సంబంధాన్ని పెంపొందించే దిశగా ఎనిమిదవ పటేల్ సదస్సును మంచిర్యాల లో ని రామ సుధారెసిడెన్సీ లో ఘనంగా నిర్వహించారు

మంచిర్యాల జిల్లా లోని వివిధ వ్యాపారవేత్తల మధ్య సమన్వయం ఏర్పరచడానికి , పటేల్ ల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశం తో పెన్ సదస్సులు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు డా, ,పి ఎల్ ఎన్ పటేల్ తెలిపారు . ఈ కార్యక్రమం లో డా, ,పి ఎల్ ఎన్ పటేల్ మాట్లాడుతూ …
మొదటి సదస్సు ల్యాండ్మార్క్ కన్వెన్షన్ సెంటర్లో వందమంది సభ్యులతో మొదలై , పటేల్ వ్యాపారవేత్తల్లో మనం అంత ఏకం కావాలని భావన కలిగేలా సదస్సు నిర్వహించడం తో సమావేశం విజయవంతం అవడంతో . రెండవ సదస్సు జూబ్లీహిల్స్లోని రూట్స్ కాలేజీలో .
మూడవ సదస్సు ఓసిమం ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో దాదాపు 200 మంది సభ్యులతో స్పీకర్ గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వేదుల వెంకటరమణ విచ్చేసి సదస్సుకు కొత్త నిర్వచనాన్ని అందించారన్నారు .
నాలుగో సదస్సు అన్ని సదస్సుల్లో కన్నా భిన్నంగా పటేల్ మహిళలకు ప్రాముఖ్యాన్ని అందించే విధంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలచే నిర్వహించిన సదస్సు. దాదాపుగా 200 మంది మహిళా ఔత్సాహికులు సదస్సులో పాల్గొన్నారని అన్నారు . ఈ సదస్సు పెన్ చరిత్రలోనే ఒక మైలురాయి అని భావించారు .
కరీంనగర్ హోటల్ v పార్క్ లో 5వ పెన్ సదస్సు కు స్పీకర్ గా సీనియర్ అడ్వైజర్ ఫర్ ఇండియా ఇండియానా ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమెరికా రాజు చింతల ,అతిధిగా మున్నూరు కాపు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కార్యదర్శి వెంకట్ పెద్దె పాల్గొన్నారు, కోఆర్డినేటర్ గా డాక్టర్ బండారి రాజ్ కుమార్ , మహేష్ పాసుల , జక్కుల ప్రకాష్ , ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ లక్ష్మీనారాయణ పటేల్ , జిల్లా డిప్యూటీ మేయర్ చల్లా హరీష్ శంకర్ పాల్గొన్నారని . ఆరవ సదస్సు గాంధీ సెంటినరీ హాల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో .
7వ పెన్ సదస్సు నగరంలోని ల్యాండ్మార్క్ కన్వెన్షన్ లో జరిగింది కినోట్ స్పీకర్ గా ప్రముఖ ఇండస్ట్రీ లిస్ట్ ప్రవీణ్ సామల అతిథిగా ల్యాండ్మార్క్ కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తెల్ల శ్రీధర్ తమ అమూల్యమైన సందేశాన్ని అందించారని తెలిపారు

ఎనిమదవ పెన్ సమావేశం మంచిర్యాల మున్నూరు కాపు వ్యాపారవేత్తలను ఒకే తాటి పై తీసుకురావాలని , ఉద్దేశం తో
మంచిర్యాల లో నిర్వహించాలని నిర్ణయించనట్లు తెలిపారు , పెన్ బృందం అనుకున్నదాని కంటే విశేష స్పందన లభించిందని , సుమారు రెండు వందల వ్యాపారవేత్తలతో సమావేశం జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు . తెలంగాణ లోని అన్ని జిల్లాలో పెన్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు
మోడరేటర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ పి ఎల్ పటేల్ , శ్రీధర్ బేతి ,విక్రమ్ , టేల్ల మురళీధర్ , మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారత దేశంలో మరియు విదేశాలలో ఉన్న పటేల్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నా సంకల్పంతో, కమ్యూనికేషన్ పెంపొందించడంలో, తద్వారా కులంలో ఐకమత్యం తీసుకు రావడానికి చేసే ప్రయత్నమే పెన్ సదస్సులు అని తెలిపారు
ఈ కార్యక్రమం లో ఎయిమ్స్ హాస్పిటల్ అధినేత డా, యెగ్గన శ్రీనివాస్ , నివృత్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత సల్ల నరేష్ , రియల్టర్ పూరేళ్ల పోచమల్లు , పిఆర్ టియు రాష్ట్ర నాయకులు డా, పార్వతి సత్యనారాయణ , పెన్ సభ్యులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here