మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి కి
వివరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు , ఎంపీ వెంకటేష్ నేత
ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలో రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి తో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మరియు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండవ ప్లాట్ ఫాం పై అదనపు టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పలు రైళ్ళ హాల్టింగు మరియు మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పలు రైల్వే సమస్యలను రైల్వే బోర్డు చైర్మన్ కి వివరించడం జరిగింది. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలను త్వరలోనే రైల్వే అధికారులతో పరిశీలన చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది.